వేరుశెనగ పప్పు తో దొండకాయ పచ్చడి

వేరుశెనగ పప్పు తో దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూదం

వేరుశెనగ పప్పు తో దొండకాయ పచ్చడి కి కావలసిన పదార్ధాలు

• దొండకాయలు
• ఎండు మిర్చి
• వేరుశెనగ పప్పు
• ధనియాలు
• ఉల్లిపాయలు
• కరివేపాకు
• కొత్తిమిర
• చింతపండు
• జిలకర
• మెంతులు
• వెల్లులిపాయలు
• వంట నూనె

వేరుశెనగ పప్పు తో దొండకాయ పచ్చడి తయారు చేయు విధానం

• ముందుగ కడాయి పెట్టి కొంచం నూనె పోసి ధనియాలు మరియు ఏండు మిరపకాయలు వేసి వేపుకోని ఒక గిన్ని లోకి తీసుకోవాలి.
• తరువాత వేరుశనగ పప్పు ను కూడా ఇదేవిధం గా వేపుకోవాలి, కొంచం ఎరుపు రంగు వచ్చే వరకు వేపుకోవాలి తరువాత ఒక గిన్ని లోకి తీసుకోవాలి.
• తరువాత ముక్కలు ముక్కలుగ తరిగిన దొండకాయలను మరియు ఉల్లిగడ్డ లను వేసి బాగా వేపుకోవాలి, దీనిని ఒక గిన్ని లో తీసి పెట్టుకోవాలి.
• తరువాత ముందుగ వేపుకున్న మిర్చి మరియు ధనియాలు Grain చేసుకోవాలి
• తరువాత వేయించి పెట్టిన వేరుశనగ పప్పు మరియు దొండకాయ లను కొంచం మెత్తగా Grain చేసుకోవాలి.
• తరువాత Grain చేసిన మొత్తని బాగా కలుపుకోవాలి దీనిని మనం పోపు పెతుక్కుంటే ఎంతో రుచికరమయిన వేరుశెనగ దొండకాయ పచడి రెడీ.
• సో దీన్ని మనం పోపు పెట్టుకుందాము ,
• పోపు కడాయి లో కొంచమ నూనె పోసి బగా వేడి అయిన తరువాత పోపు గింజలు వేసి వేగిన తరువాత కరివేపాకు వేసి, దీనిని Grain చేసిన మిశ్రమం లో కలుపుకోవాలి .
• ఫైనల్ గా మనకు వేడి వేడి వేరుశెనగ దొండకాయ పచడి తయారైపోయింది, ఈ పచడి ని వేడి వేడి అన్నం లో కొంచం వెన్న కానీ నెయ్య వేసుకుని తింటే భలే రుచికరం గ ఉంటుంది ఫ్రెండ్స్, మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందొ కామెంట్ లో తెలియచేయండి.